- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Court Collections: రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన నాని 'కోర్ట్' మూవీ .. ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవలే మూవీ బాగుంటే తప్ప ఆడియెన్స్ థియేటర్లకి వెళ్ళడం లేదు. ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' మార్చి 14న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో హోలీ కానుకగా వచ్చింది. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తుంది. కంటెంట్ పరంగానే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'కోర్ట్' మూవీ ప్రీమియర్స్, మొదటి రాజు కలెక్షన్స్ రూ. 8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక, రెండు రోజుల్లో రూ.15.90 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీకి రూ.11 కోట్ల బడ్జెట్ పెట్టారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 9.5 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ బిజినెస్ రూ.7 కోట్లు జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ.7.5 కోట్ల బరిలోకి దిగింది. అయితే, ఈ మూవీ .. కేవలం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి కొత్త రికార్డు క్రియోట్ చేసింది.
మూడు రోజుల కలెక్షన్స్ లో రూ.24.4 కోట్లు కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. మూడో రోజు ఆదివారం రావడంతో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో స్క్రీన్లు కూడా పెరిగాయి. దీంతో, మూడవ ఎక్కువ కలెక్ట్ చేస్తాయని నిర్మాతలు ముందే అంచనా వేశారు. ఓ వైపు స్టూడెంట్స్ కు పరీక్షలు జరుగుతున్న టైంలో విడుదలై ఇలాంటి సక్సెస్ సాధించడమంటే మామూలు విషయం కాదు. లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా సినీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE ...
అర్జున్ S/O వైజయంతి నుంచి టీజర్ రిలీజ్.. ఎమోషనల్‌గా సాగిన అమ్మ సెంటిమెంట్