‘దండం పెడుతున్నాం.. దయ చూపండి…’

by Aamani |
‘దండం పెడుతున్నాం.. దయ చూపండి…’
X

దిశ బ్యూరో,ఖమ్మం: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆద్వర్యంలో రేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు రేషన్ కార్డులు అందించేందుకు TWJF సోమవారం శ్రీకారం చుట్టింది. TWJF జిల్లా ఉపాధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన idoc భవనంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వార్తల సేకరణ అంశంలో విధులలో బిజీగా ఉంటూ తమ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా వార్త సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టులకు రేషన్ కార్డులు లేకపోవడంతో టీ డబ్ల్యూ జేఎఫ్ దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.. మరి కొంతమంది జర్నలిస్టులకు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చిన్న పిల్లల పేర్లు నమోదులో అంశంలో కూడా రేషన్ కార్డులో నమోదు కాకపోవడంతో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టి డబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో రేషన్ కార్డ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.. ఈ సందర్భంగా TWJF నేతలు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కు చేతులు చేతులు జోడించి సంస్కారంతో నమస్కరించి వేడుకున్నారు..

రేషన్ కార్డు లేని జర్నలిస్టులకు తొలి ప్రాధాన్యతగా కొత్త రేషన్ కార్డులు తక్షణమే ఇచ్చేలా చూడగలరని మనవి చేసింది TWJF.. అనేకమంది జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కావడంతో వారి ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం ఆశాజనకంగా లేవని,ఏ పథకానికైనా రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నారని, జర్నలిస్టుల దీనావస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన జర్నలిస్టుల సంక్షేమం కోసం టీ డబ్ల్యూ జేఎఫ్ అహర్నిశలు కృషి చేస్తుందని నేతలు అన్నారు.. స్పందించిన ఆధనం కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డి.ఎస్.ఓ అధికారిని పిలిచి జర్నలిస్టులకు రేషన్ కార్డుల అంశంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ కార్యక్రమంలో TWJF నేతలు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, కూరకుల గోపి, యోగి నాటి మాధవ్, మానుకొండ రవి కిరణ్, అయ్యప్ప, యాకేష్, కేవి, ఎస్,కే జానిపాషా, సాగర్, సుభాన్, మూర్తి, ఉపేందర్, శ్రీనివాస్, దేవేందర్, బిక్షం, ప్రభాకర్, కంభంపాటి శ్రీనివాసరావు, మధుసూదన్, కెమెరమెన్లు యాకుబ్ పాష, ఫయాజ్, అర్షద్, గణేష్, మహిళ రిపోర్టర్లు మధు శ్రీ, మౌనిక, టౌన్ రిపోర్టర్ రవి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story