- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అర్జున్ S/O వైజయంతి నుంచి టీజర్ రిలీజ్.. ఎమోషనల్‌గా సాగిన అమ్మ సెంటిమెంట్

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇక టీజర్‌ను గమనించినట్లయితే.. ‘పది సంవత్సరాల నా కెరియర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్.. కానీ చావుకు ఎదురెళ్లిన ప్రతిసారి నా కళ్ల ముందు కనిపించే ఒక రూపం నా కొడుకు అర్జున్’ అని విజయశాంతి చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది.
ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మనసులను కట్టిపడేస్తుంది. అలాగే యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్ని అన్ని అదిరిపోయాయి. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను మరింత వైల్డ్‌గా చూడబోతున్నామని ఈ టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. ఫైనల్‌గా టీజర్ సూపర్ డూపర్‌గా ఉందని చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్‌ను చూసేయండి.
READ MORE ...
HIT-3: నాని 'హిట్-3'కి ఓటీటీలో భారీ ధర.. హైప్ పెంచేస్తున్న న్యూస్