TG Assembly: ఉస్మానియా వర్సిటీకీ ఆ పేరు పెట్టండి.. అసెంబ్లీలో ఏలేటి సంచలన ప్రతిపాదన

by Shiva |   ( Updated:2025-03-17 08:07:56.0  )
TG Assembly: ఉస్మానియా వర్సిటీకీ ఆ పేరు పెట్టండి.. అసెంబ్లీలో ఏలేటి సంచలన ప్రతిపాదన
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ (Potti Sriramulu Telugu University) పేరు మార్పుపై వాడీవేడి చర్చ జరిగింది. అయితే, ఆ వర్సిటీకి తెలంగాణ సుప్రసిద్ధ రచయిత సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy) పేరు పెట్టబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేరు మార్పును బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) వ్యతిరేకించారు. అసలు పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)కి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలంటూ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్య అని అన్నారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, దళితుల కోసం అనునిత్యం పోరాటం చేసిన వ్యక్తి అని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story

Most Viewed

    null