తప్పు మీది కాదు, అంతా ఈవీఎంలదే.. కూటమి ప్రభుత్వంపై రోజా సంచలన విమర్శలు

by Ramesh Goud |
తప్పు మీది కాదు, అంతా ఈవీఎంలదే.. కూటమి ప్రభుత్వంపై రోజా సంచలన విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: తప్పు మీది కాదు.. అంతా ఈవీఎం (EVM) లదేనని, మీరు ముందే చెప్పారు కదా అని మాజీమంత్రి, వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా (YSRCP Leader RK Roja) అన్నారు. పాఠశాలల నిర్వహణపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... కూటమి ప్రభుత్వం (Coilation Government)పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. మెడికల్ కాలేజీలకు (Mediacl College) మంగళం పాడేశారని, రైతు భరోసా కేంద్రాలను (Raithu Bharosa Centers) ఎత్తేస్తున్నారని, ఇప్పుడు బడుల వంతు వచ్చిందా అని అన్నారు. అలాగే అయినా.. "విద్య ప్రభుత్వ బాధ్యత కాదు" అని ముందే మీరు చెప్పారు లెండి అంటూ.. తప్పు మీది కాదు.. తప్పంతా ఈవీఎంలదేనని ఎద్దేవా చేశారు.

ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా (Belt Shops) ఉండవచ్చా..? అని ప్రశ్నించారు. బాగుందాయ్యా.. బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది! అని రోజా రాసుకొచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనలో ఉన్నదని, రాష్ట్రంలోని 32, 596 ప్రైమరీ స్కూళ్లను మూసివేతకు రంగం సిద్దం చేస్తోందని వార్తలు ఊపందుకున్నాయి. దీంతో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పాలన చేతకాక ఇలా స్కూళ్లకు మంగళం పాడే పని పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed