- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశ రాజకీయాల్లో విషాదం.. మాజీ కేంద్ర మంత్రి కన్నుమూత

దిశ, వెబ్ డెస్క్: దేశరాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి లేన్‌లోని తన కుమారుడి అధికారిక నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 84 ఏళ్ల ప్రధాన్.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఒడిశాలో బీజేపీకి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మరణానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛాలు అర్పించారు. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. కాగా ప్రధాన్ 1998 నుండి 2004 వరకు ఒడిశాలోని జరగఢ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం పూరీలో దేవేంద్ర ప్రధాన్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేశారు.
బిజెపి సీనియర్ నాయకుడైన దేవేంద్ర ప్రధాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారిక నివాసంలో తుదిశ్వాస విడిచారు. జూలై 16, 1941న జన్మించిన ఆయన 1966లో కటక్‌లోని SCB మెడికల్ కాలేజీ నుండి MBBS డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆయన తల్చేర్ నుండి వైద్య అధికారిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే, సామాజిక సేవలు, వ్యవసాయం కోసం ప్రభుత్వ సేవను వదులుకున్నారు. ఒడిశాలో బిజెపి సంస్థను నిర్మించడంలో ప్రధాన స్తంభాలలో ఒకరైన డాక్టర్ ప్రధాన్ 1983లో కాషాయ పార్టీలో చేరారు. అదే సంవత్సరం పార్టీ తాల్చేర్ మండల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు, 1985 వరకు ఆ పదవిలో ఆయన ఉన్నారు.
1984లో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ ఆయనను దేవ్‌ఘర్ లోక్‌సభ స్థానం నుండి నామినేట్ చేసింది, ఆ స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. 1985లో ఆయనకు అవిభక్త దెంకనల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. 1988 నుంచి 1993 వరకు వరుసగా రెండు పర్యాయాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 నుండి 1997 వరకు ఆయన మూడవసారి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు కుశభావు ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ దేవేంద్ర ప్రధాన్.. 1991, 1996ల తర్వాత.. 1998లో డియోగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు.
అదే సంవత్సరం, ఆయన అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో ఉపరితల రవాణా మంత్రి అయ్యారు. ఆయన 1991 ఎన్నికల్లో మళ్ళీ డియోగఢ్ నుండి గెలిచి, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర ఉపరితల రవాణా ,వ్యవసాయ మంత్రి అయ్యారు. డాక్టర్ ప్రధాన్ 2001-02 వరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పల్లాహర చేతిలో ఓడిపోయిన తర్వాత ఆయన ఎన్నికల రాజకీయాలు ముగిశాయి. అయితే, ఆయన పార్టీని మార్గ్ దర్శకుడిగా నడిపించడం కొనసాగించారు.