పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

by Mahesh |   ( Updated:2025-03-17 08:03:55.0  )
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు (Budget sessions in Telangana Assembly) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు సభలు (Fourth day of the meeting) జరుగుతుండగా.. ఈ రోజ సభలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Assembly Speaker Gaddam Prasad Kumar) అనుమతితో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లలను మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) ప్రవేశపెట్టారు. అనంతరం తెలుగు (పోట్టి శ్రీరాములు) యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములుకు బదులు సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy) పేరును పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) సురవరం ప్రతాప రెడ్డి మార్పు ప్రతిపాదన చేశారని సభ లో వెల్లడించారు. అయితే ఈ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయగా.. బీజేపీ ఎమ్మెల్యేలు.. యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకించారు. అనంతరం పేరు మార్పుపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ చర్చ అనంతరం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం (Assembly approves name change bill) తెలిపింది. దీంతో అధికారంగా ఇకపై తెలుగు యూనివర్సిటీ.. సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ గా మారనుంది.

Next Story