- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యం వికటించి వ్యక్తి మృతి.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

దిశ,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యం వికటించి సామ్య నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు.కేశంపేట్ మండలం కోనయపల్లి గ్రామం లచ్చ నాయక్ తండా కు చెందిన వి.స్వామ్య నాయక్ వైద్యం కోసమని మూడు రోజుల క్రితం షాద్ నగర్ లోని బాలాజీ మల్టి స్పెషలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు.గత రాత్రి చికిత్స పొందుతూ ఆకస్మాత్తుగా మృతి చెందాడు. మృతి చెందిన సామ్య నాయక్ మృతదేహాన్ని బాలాజీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ యాజమాన్యం బంధువులకు చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయినప్పుడు బాలాజీ హాస్పిటల్ లో ఉండవలసిన మృతదేహం తమకు చెప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏముందని బంధువులు ప్రశ్నించారు. మూడు రోజుల ముందే ఈ హాస్పిటల్ లో చికిత్స బాగాలేదని వేరే హాస్పిటల్ కి తరలిస్తామని చెప్పగా హాస్పిటల్ సిబ్బంది తాము నయం చేస్తామని నమ్మబలికి ఇక్కడే ఉంచుకొని ప్రాణం తీశారని బంధువులు వాపోయారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.