- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్‍పై మండలిలో చర్చ.. వారి పై మంత్రి లోకేష్ సీరియస్!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) ఈ రోజు(సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) ఫీజు రీయింబర్స్‌మెంట్ పై మాట్లాడారు. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బకాయిల్ని కచ్చితంగా చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ మండలిలో స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2019లో వైసీపీ వచ్చాక పాత బకాయిల్ని 16 నెలల తర్వాత చెల్లించింది. మాకు రూ.4200 కోట్లు బకాయి పెట్టి వెళ్ళింది. అది నిజమో కాదో చెప్పాలి.. వివరాలు పంపిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. స్కూల్ ఫీజు రీయింబర్స్మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివరాలన్నీ ఉన్నాయన్నారు. మేం వచ్చి 10 నెలలే అయ్యింది. మొత్తం క్లియర్ చేస్తామని మంత్రి లోకేష్ తెల్చి చెప్పారు.
ఈ విషయాన్ని గత చర్చలో స్పష్టంగా చెప్పాం. కానీ వైసీపీ సభ్యులు బాయ్‌కాట్ చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారని అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్మెంట్‌కు(Fee reimbursement) సంబంధించిన విషయాలన్నీ ఆరోజే చెప్పామని తెలిపారు. వైసీపీ(YSRCP) వాళ్లు వినకుండా బాయ్ కాట్ చేసి.. మళ్లీ ఆరోపణలు చేస్తున్నారని నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాస్తవాలు చెబుతుంటే దానిని ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్న వినే పరిస్థితిలో వైసీపీ లేదు అని మంత్రి లోకేష్ ఫైరయ్యారు.