- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'భర్త పురుషత్వంపై ఆరోపణలు క్రూరత్వం'
న్యూఢిల్లీ/బెంగళూరు: భార్య తన భర్త ‘పురుషత్వం’పై ఆరోపణలు చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. తన భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఓ మహిళ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ సురేశ్ కుమార్, నానీ బన్సల్ క్రిష్ణతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారించింది. ఈ సందర్భంగా బాధితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తన క్లయింట్‌ను అతని భార్య తరచూ తిడుతూనే ఉంటుందని, తనను వరకట్న డిమాండ్ల కోసం వేధిస్తున్నట్టు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు పొరుగువారితో అబద్ధాలు చెబుతుందని తెలిపారు. అంతేకాకుండా, అతని పురుషత్వంపైనా ఆరోపణలు చేసి, బలవంతంగా నపుంసకత్వ పరీక్షలు సైతం చేయించినట్టు న్యాయవాది వివరించారు. ఇందులో అతను ఫిట్‌గా ఉన్నట్టు వెల్లడైందని తెలిపారు. దీంతో ఆ మహిళను క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా, తన భర్తపై ఆమె చేసినవన్నీ అబద్ధపు ఆరోపణలేనని తేలింది. తన భర్త శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్లాడని, ఆ కారణంతోనే నపుంసకత్వ పరీక్షలు చేయించానని ఒప్పుకుంది.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఒక వ్యక్తి పౌరుషం/పురుషత్వంపై చేసే అవమానాలు, ఆరోపణలు సదరు వ్యక్తిని నిరాశ, నిస్పృహకు గురిచేయడమేకాకుండా, మానసికంగా కూడా బాధాకరంగా ఉంటాయని తెలిపింది. పైగా, జీవిత భాగస్వామి ప్రతిష్టను బహిరంగంగా దెబ్బతీయడం, పరువుకు నష్టం కలిగించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం అత్యంత క్రూరమైన చర్య అని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థించింది. ఇదిలా ఉండగా, తన భార్య అక్రమసంబంధం పెట్టుకుందని, ఆమెకు పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదని, కావున తమకు విడాకులివ్వలాని కోరుతూ ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత, ఎలాంటి ఆధారాలు లేకుండా భార్యను అనుమానించడం, ఆమెకు పుట్టిన సంతానం తన బిడ్డ కాదనడం తీవ్రమైన క్రూరత్వమని వెల్లడించింది. ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు సదరు వ్యక్తికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది.