- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. శకలాలను ఎలా గుర్తించారంటే?
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిపోయాక ఆ శకలాలను ఎలా గుర్తించామనే వివరాలను ఇరాన్ మిలటరీ వెల్లడించింది. తాము దేశీయంగా తయారుచేసిన డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ శకలాలను గుర్తించామని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ ఆదివారం అజర్ బైజన్ సరిహద్దుల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తబ్రిజ్ సిటీకి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల హెలికాప్టర్ కూలిపోయింది.
సోమవారం తెల్లవారుజామున హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈయూ, రష్యా, టర్కీ సాయంతో ఇరాన్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నైట్ విజన్ పరికరాలు ఉన్నప్పటికీ ప్రమాదస్థలాన్ని గుర్తించడంలో టర్కీ డ్రోన్ విఫలమైందని ఇరాన్ మిలిటరీ తెలిపింది. చివరకు ఇరాన్ తయారు చేసిన డ్రోన్ల సాయంతో.. గ్రౌండ్ రెస్క్యూ టీం, సాయుధ దళాలు ప్రమాద స్థలాన్ని గుర్తించాయి. ఇక హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇరాన్ సాయుధ దళాల అధిపతి మహ్మద్ బఘేరి దర్యాప్తునకు ఆదేశించారు. ఇరాన్ అధ్యక్షుడు రయీసీ, విదేశంగా మంత్రి హొస్సేన్ అమీర్ అబ్లోల్లాహియాన్ సహా ఏడుగురు చనిపోయిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.