Helicopter Crashes: హైదరాబాద్ వస్తుండగా.. పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్

by Shamantha N |
Helicopter Crashes: హైదరాబాద్ వస్తుండగా.. పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతికూల వాతావరణ, బలమైన గాలుతో పూణేలో హెలికాప్టల్ కూలిపోయింది. మహారాష్ట్రలో పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్‌ కూలింది. AW 139 అనే చాపర్ ముంబైలోని జుహు నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ లో నలుగురు ఉండగా.. ఈ ఘటనలో కెప్టెన్ ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని పూణే రూరల్‌ ఎస్పీ పంకజ్‌ దేశ్‌ముఖ్‌ ధ్రువీకరించారు. గాయపడిన కెప్టెన్‌ ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మిగితా ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

మహారాష్ట్రకు భారీ వర్ష సూచన

ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, పశ్చిమ మహారాష్ట్రలోని పూణే, సతారా జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే రెండ్రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయంది. మరోవైపు, గత నెలలోనూ ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. శివసేన నేత సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాదానికి ముందు పైలట్ హెలికాప్టర్ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed