కేజ్రీవాల్‌‌కు గుజరాత్ యూనివర్సిటీ బిగ్ షాక్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 04:34:24.0  )
కేజ్రీవాల్‌‌కు గుజరాత్ యూనివర్సిటీ బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే విచారణకు హాజరయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ యూనివర్సిటీ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రధాని మోడీ డిగ్రీ ఫేక్. ఒక వేళ ప్రధాని ఢిల్లీ వర్సిటీ, గుజరాత్ వర్సిటీల్లో చదివి ఉంటే మా విద్యార్థి దేశ ప్రధాని అయ్యారని గుజరాత్ యూనివర్సిటీ ఎందుకు పండగ చేసుకోవడం లేదు అని కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ ఆయనపై క్రిమినల్ పరువు నష్టం దావా వేసింది. ఆ కామెంట్స్ తమకు అప్రతిష్ట కలిగించాయని పేర్కొంది. కేజ్రీవాల్ తో పాటు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పైనా ఈ దావా వేసింది. వీటిని పరిశీలించిన అహ్మదాబాద్ లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆ ఇద్దరు నాయకులకు శనివారం సమన్లు పంపించారు. మే 23న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు.


ఇవి కూడా చదవండి:

సీఎం కేజ్రీవాల్‌ పై సీబీఐ ప్రశ్నల వర్షం.. తొమ్మిదిన్నర గంటలు సాగిన ఎంక్వయిరీ

Advertisement

Next Story

Most Viewed