Gujarath: బిల్కీస్ బానో కేసులో కీలక పరిణామం.. గుజరాత్ ప్రభుత్వానికి చురకలు

by Ramesh Goud |
Gujarath: బిల్కీస్ బానో కేసులో కీలక పరిణామం.. గుజరాత్ ప్రభుత్వానికి చురకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిల్కీస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మరోసారి చురకలు అంటించింది. ఈ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. బిల్కీస్ బోనో సామూహిక హత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తుల హత్య దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా ఉన్న 11 మందికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తూ విడుదల చేసింది. దీనిపై సుప్రీం కోర్టు వారి విడుదల చెల్లదని, దోషులను రెండు వారాల్లోగా అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పునిచ్చింది.

అంతేగాక ఈ అంశంలో ఉపశమనం ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని పేర్కొంది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం సహా దోషులు రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. దోషుల ఉపశమనాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్తానం ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఈ పిటీషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ఉన్న ఛాలెంజ్ కింద ఉన్న ఆర్డర్ మరియు దానికి అనుబంధంగా ఉన్న పేపర్ లను పరిశీలించి, ఈ పిటీషన్లలో ఎలాంటి లోపం కనిపించలేదని, ఇందులో ఎలాంటి మెరిట్ లేదని చెబుతూ.. గుజరాత్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో ప్రభుత్వతీరును ఎండగడుతూ పిటీషన్ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed