Cyberabad: నగర ప్రజలకు సీపీ అవినాష్ హెచ్చరిక.. రాత్రి 10 గంటల తర్వాత అలా చేస్తే కఠిన చర్యలు

by Y.Nagarani |
Cyberabad: నగర ప్రజలకు సీపీ అవినాష్ హెచ్చరిక.. రాత్రి 10 గంటల తర్వాత అలా చేస్తే కఠిన చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి రోజు రాత్రికి ఎన్ని క్రాకర్స్ పేలుతాయో, ఎంత కాలుష్యం కమ్ముకుంటుందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే యువత రోడ్లపై బాంబులు పేల్చుతూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి (Cyberabad CP Avinash Mohanty) కీలక ప్రకటన చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ దీపావళి సందర్భంగా ఈ నిబంధనలు ఉంటాయని, ప్రజలు గ్రహించి తమకు సహకరించాలని కోరారు. రాత్రి 8 గంటలకు ముందు గానీ.. 10 గంటల తర్వాత గానీ.. పబ్లిక్ ప్లేసుల్లో, పోలీస్ స్టేషన్ల పరిధిల్లో క్రాకర్స్ పేల్చితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి.. దీపావళిని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

Advertisement

Next Story