- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Siddaramaiah : ఉచిత బస్సు ప్రయాణం రద్దు ఊహాగానాలకు చెక్.. సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న శక్తి పథకాన్ని పున:సమీక్ష చేసే ఆలోచన ప్రభుత్వం ముందు లేదని సీఎం స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగుతుందని తెలిపారు.
‘అతను (శివకుమార్) కొంతమంది మహిళలు చెప్పేది మాత్రమే చెప్పాడు. నాకు తెలియదు, నేను అక్కడ లేను. నేను మాట్లాడతాను’ అని వెల్లడించారు. కాగా, చాలా మంది మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ఉచిత రైడ్ అక్కర్లేదని ట్వీట్స్, మెయిల్ పంపారని డీకే శివకుమార్ తాజాగా మాట్లాడటం చర్చానీయాంశంగా మారింది. టికెట్ డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న క్రమంలో దీనిపై రవాణా మంత్రి రామలింగారెడ్డి తో చర్చిస్తాను అని శివకుమార్ అన్నారు.