గోద్రా కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలి.. - సుప్రీంకోర్టుకు గుజరాత్ ప్రభుత్వం విన్నపం

by Javid Pasha |
గోద్రా కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలి..   - సుప్రీంకోర్టుకు గుజరాత్ ప్రభుత్వం విన్నపం
X

న్యూఢిల్లీ: గోద్రా ట్రైన్ దహన కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇటీవలే వీరి మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అత్యంత దయనీయమైన ఘటనలో శిక్ష అమలులో ఎలాంటి మార్పు లేకుండా చూడాలని గుజరాత్ ప్రభుత్వ తరుఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. గుజరాత్ రాష్ట్ర పాలసీ ప్రకారం వీరికి ముందుస్తు విడుదలకు పరిశీలనకు రాలేదని చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా 59 మంది సజీవంగా కాలిపోయారని, బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా బోగీని నిర్భంధించారని తెలిపారు.

అయితే ఇప్పటివరకు వారికి అమలైన శిక్షతో పాటు వారు అనుభవించిన శిక్ష కాలానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని సుప్రీం గుజరాత్ కౌన్సిల్‌ను కోరింది. విచారణ సందర్భంగా ఈ కేసులో 11 మంది నిందితులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించిందని, మరో 20 మందికి జీవిత ఖైదు విధించిందని మెహతా ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసులో మొత్తం 31 మందిని నేరస్థులుగా హైకోర్టు సమర్థించిందని, 11 మందికి మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చిందని ఆయన తెలిపారు. గతేడాది డిసెంబర్ 15న సుప్రీంకోర్టు ఈ కేసులో ఒకరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మరికొందరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 2002 గోద్రా ఘటనలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 కోచ్‌‌కు నిప్పంటించిన ఘటనలో 59 మంది మరణించారు.


Advertisement

Next Story

Most Viewed