FASTAG : ఫాస్టాగ్ పరేషాన్.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-01 12:27:59.0  )
FASTAG : ఫాస్టాగ్ పరేషాన్.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ గేట్ల వద్ద జాప్యం లేకుండా ఆన్ లైన్‌లో త్వరితగతిన రుసుములు చెల్లించేందుకు ఫాస్టాగ్‌ను వాహనదారులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్‌లు లేని వాహనాల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. అందువల్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ అనేది తప్పనిసరి.

ఫాస్ట్ ట్యాగ్‌పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తాజా ఉత్తర్వులతో ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాల క్రితం జారీచేసిన అన్ని ఫాస్ట్ ట్యాగ్‌ల కేవైసీని అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని NPCI కోరింది. ఐదు సంవత్సరాల క్రితం జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్‌లను తప్పనిసరిగా మార్చుకోవలసి ఉంటుందని తెలిపింది. ప్రతీ వాహనదారుడు తమ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన తేదీని చెక్ చేసుకొని, కేవైసీని పూర్తి చేయడంతో పాటు ఐదు సంవత్సరాలు పూర్తయిన వాటి స్థానంలో కొత్తగా అప్డేట్ చేసుకోవాలని NPCI పేర్కొన్నది. దీనికి చివరి తేదీ ఈ సంవత్సరం అక్టోబర్ 31 గా నిర్ణయించారు. సంబంధిత వాహన ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా తమ వ్యక్తిగత మొబైల్ నంబరుకు లింక్ చేయాలని, కేవైసీ చివరి తేదీ వరకు వేచిచూడకుండా వీలైనంత తొందరగా వాహనదారులను అప్డేట్ చేసుకోవలసిందిగా ఎన్పీసీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

దీన్ని ఎలా చేసుకోవాలి?

ఆన్ లైన్‌లో సంబంధిత ఫాస్ట్ ట్యాగ్ పోర్టల్ వెబ్సైట్‌లో మీరు నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్ లైన్‌లో ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడ్ చేసే బ్యాంక్‌లు, సంస్థల దగ్గరికి నేరుగా వెళ్లి కూడా అప్డేట్ చేసుకోవచ్చు.

అప్డేట్ చేయకపోతే రెట్టింపు చార్జీలు

నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా టోల్ వసూలుపై ప్రకటించిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం... విండ్ షీల్డ్ పై ఫాస్ట్ ట్యాగ్ అమర్చని వాహనాలకు రెట్టింపు చార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. అనగా అప్డేట్ చేసిన ఫాస్ట్ ట్యాగ్‌ని విండ్ షీల్డ్‌కి తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. లేనిచో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆలస్యం అవుతాయని తద్వారా ఇతర వాహనదారులకు ఇబ్బందులు తప్పవని NHAI పేర్కొంది. ఈ కారణంగానే చార్జీలను రెట్టింపు చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశంలోని అన్ని జాతీయ రహదారుల్లో ఉన్న టోల్ ప్లాజాలు ఈ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed