- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుసంఘాల నిరసన ఎఫ్టెక్ట్.. మధ్యప్రదేశ్ లో కర్ణాటక రైతుల అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాయి రైతు సంఘాలు. నిరసనకు ముందు మధ్యప్రదేశ్ లో కర్ణాటకకు చెందిన రైతులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. భోపాల్ రైల్వేస్టేషన్ లో రైతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దేశరాజధాని ఢిల్లీలో పోలీసు భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. సరిహద్దుల్లో సమావేశాలపై ఆంక్షలు విధించినప్పటికీ కర్ణాటక నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైలెక్కారు కర్ణాటక రైతులు. కర్ణాటకలోని హుబ్బెళ్లి నుంచి ఢిల్లీకి వెళ్తున్న రైతులను భోపాల్ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు పోలీసులు.
ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టిక్రి, సింగు, ఘాజీపూర్ లలో అదనపు పికెట్ లు ఏర్పాటు చేశారు. యూపీ, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లు, పికెట్ లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నిరసనలకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా కర్ణాటక రైతులను అరెస్టు చేశారు. తనను జైలుకు పంపినట్లు మధ్యప్రదేశ్ రైతు నాయకుడు అనిల్ యాదవ్ తెలిపారు.
మరోవైపు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు భోపాల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అవదేశ్ గోస్వామి. ఢిల్లీలో సమావేశాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించినందున.. రైతు నాయకులను నిర్బంధించామని తెలిపారు. ఢిల్లీకి వెళ్లేందుకు రైతులకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. మధ్యప్రదేశ్ లోని నర్మదాపురంలో రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రైతు నాయకులు శివరాజ్ రాజోరియా, మహేశ్ ఉపాధ్యాయ్, సచిన్ శర్మలను సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జైలుకు పంపినట్లు నర్మదాపురం ఎస్పీ గురకరణ్ తెలిపారు. ఈ ముగ్గురు నేతలు నిరసనలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం అందిందని.. ఐపీసీ 151 కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. గ్వాలియర్, జబల్‌పూర్, చింద్వారాలోనూ రైతు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో రైతు నేతలపై పోలీసుల చర్యను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఖండించారు. ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు వెళ్తున్న హుబ్బెళ్లి రైతులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. తమ రాష్ట్రానికి చెందిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రైతులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పటికీ.. ఈ చర్య వెనక ప్రధాని మోడీ ప్రభుత్వ నేరపూరిత మెదడు ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రస్తుత చర్యలను చూస్తుంటే రైతులను భయభ్రాంతులకు గురి చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.