Elon musk: ఎలాన్ మస్క్ పై అరిజోనా మహిళ దావా

by Shamantha N |   ( Updated:2024-11-06 06:41:45.0  )
Elon musk: ఎలాన్ మస్క్ పై అరిజోనా మహిళ దావా
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు టెస్లా అధినేత మస్క్ మద్దతిచ్చారు. కాగా.. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎలాన్‌ మస్క్‌ (Elon musk) ఎలక్షన్ గివ్ అవే కింద ప్రైజ్ మనీని ప్రవేశపెట్టారు. అయితే, ఆ ప్రైజ్‌మనీ విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగానే నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్‌మనీ ఇస్తున్నారని ఓ మహిళ మస్క్‌పై దావా వేశారు. టెక్సాస్ ఫెడరల్‌ కోర్టులో ఆరిజోనా నివాసి జాక్వెలిన్‌ మెక్‌అఫెర్జీ మస్క్ పై దావా వేశారు. మస్క్ ప్రవేశపెట్టిన స్కీంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు కాకుండా ముందుగానే నిర్ణయించిన వారికి ప్రైజ్‌మనీ ఇస్తున్నారని జాక్వెలిన్‌ ఆరోపించారు. అదేవిధంగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించడం, తన సోషల్‌ మీడియాకు వ్యూయర్‌షిప్‌ పెంచుకోవడంతో మస్క్‌, ఆయన మద్దతుదారులకు లాభం చేకూరిందని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై మస్క్‌ తరఫు న్యాయవాదులు స్పందించలేదు.

ప్రైజ్ మనీ స్కీం

స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వాక్‌ స్వాతంత్ర్యం, ప్రతిఒక్కరికి గన్ కలిగి ఉండే హక్కుకు మద్దతుగా సంతకం చేసిన ఓటరుకు 100 డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తానని ప్రకటించారు. మరో ఓటరును సిఫార్సు చేస్తే 47 డాలర్లు ఇస్తామని వెల్లడించారు. ఇలా సంతకాలు చేసిన వారిలోంచి లాటరీ ద్వారా ఎంపిక చేసి ప్రైజ్‌మనీ అందిస్తామని పేర్కొన్నారు. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడమే అని డెమొక్రాట్లు ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు ఆశ చూపుతున్నారని డెమొక్రట్లు ఫిర్యాదు చేయగా.. ఆయనకు అమెరికా జాతీయ ఎన్నికల కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.


Read More..

Stock markets: అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ట్రంప్ ముందజ.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

Advertisement

Next Story

Most Viewed