US Election Results: అమెరికా సెనేట్ పై రిపబ్లికన్ల కంట్రోల్

by Shamantha N |
US Election Results: అమెరికా సెనేట్ పై రిపబ్లికన్ల కంట్రోల్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో ట్రంప్‌ విజయం దాదాపు ఖాయమైనట్టే. ఇలాంటి నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ సెనెట్‌పై(US Senate) కంట్రోల్ తెచ్చుకుంది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి లభించాయి. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్‌లో 34 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల (US Election Results) ఆధారంగా డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది ఉన్నారు. మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సరికొత్త కార్యవర్గం ఎంపిక, టాప్ కోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్లకే పట్టు ఉంటుంది. రానున్న రోజుల్లో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు రిటైర్‌ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపాయి. 2021 నుంచి సేనేట్‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక సేనేట్ నేత‌గా కొత్త లీడ‌ర్‌ను ఎన్నుకోనున్నారు.

హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ ముందంజ

మరోవైపు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ముందంజలో ఉంది. ఇక 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు దక్కాయి. గతంతో పోలిస్తే ఒకటి ఎక్కువ. మరోవైపు డెమొక్రట్లు 154 స్థానాలు సాధించారు. దీంతో ఈసారి ట్రంప్‌ విజయం సాధిస్తే.. ఆయనకు కాంగ్రెస్‌ నుంచి పెద్దగా సమస్యలు ఎదురుకాని పరిస్థితి తలెత్తవచ్చు.

Advertisement

Next Story

Most Viewed