- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth Reddyని కలిసిన బీఆర్ఎస్ నేత కాసాని.. కాంగ్రెస్ చేరుతున్నారంటూ...
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ లీడర్ కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneswar) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కొద్ది సేపటి క్రితం కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఒకపక్క బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య ఈ స్థాయిలో వాడివేడిగా ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో కాసాని ఇలా సీఎంని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని కాసాని తరపు నేతలు చెబుతున్నా.. కొంత మంది మాత్రం బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్లో చేరబోతున్నారు కాబట్టే తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు.
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ (TDP)లో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్.. ఆ తర్వాత కేసీఆర్ వద్దకు చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. మరిప్పుడు కూడా మళ్లీ పార్టీ మారతారా..? ప్రచారాలను నిజం చేస్తారా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.