Vishwak Sen: ఐ హేట్ మై డాడీ అంటున్న విశ్వక్ సేన్.. కారణం ఏంటంటే?

by sudharani |   ( Updated:2024-11-06 11:09:25.0  )
Vishwak Sen: ఐ హేట్ మై డాడీ అంటున్న విశ్వక్ సేన్.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. మొదట అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రం ఇప్పుడు నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి (Ram Talluri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

ఇం.. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐ హేట్ యూ మై డాడీ’ (I Hate You My Daddy) లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఐ హేట్ యూ మై డాడీ.. నీ మీదే నా చాడీ.. నువ్వు చెప్పిన ఆటాడి గెలవాల మేమోడీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఫన్నీగా ఆకట్టుకుంటోంది. తన ఇష్టం లేకపోయిన తండ్రి చెప్పిన పనులు చేస్తూ విసిగిపోయే కొడుకులకు ఈ సాంగ్ బాగా కనెక్ట్ (connect) అయ్యే విధంగా ఉంది. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.


Read More..

Brahmamudi : ఇది ముందే తెలిస్తే రోజు ఇలా పడేసేదాన్ని కదా అంటూ.. రొమాంటిక్ గా మాట్లాడిన కావ్య


Advertisement

Next Story