TPCC : హైడ్రాతో పడిపోయింది రియల్ ఎస్టేట్ కాదు..బీఆర్ఎస్ గ్రాఫ్ : సామ

by Y. Venkata Narasimha Reddy |
TPCC : హైడ్రాతో పడిపోయింది రియల్ ఎస్టేట్ కాదు..బీఆర్ఎస్ గ్రాఫ్ : సామ
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా(Hydra)తో పడిపోయింది నగరంలో రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారం కాదని,.బీఆర్ఎస్(Brs)పార్టీ గ్రాఫ్ మాత్రమేనని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) ఎద్దేవా చేశారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను సామ తిప్పికొట్టారు. కేటీఆర్ పథకం ప్రకారమే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మీటింగ్ పెట్టారని సామ రామ్మోహన రెడ్డి విమర్శించారు. ముక్కు ముఖం తెలియని వారు రియల్టర్లు అని చెప్తున్నారన్నారు. గత సంవత్సరం పుట్టిన రియల్ ఎస్టేట్ సంఘం ఇదని, పార్టీ నేతలను కలుపుకుని రియల్ ఎస్టేట్ మీటింగ్ అని కేటీఆర్ కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ లు పెరిగాయన్నారు. హైడ్రా చెరువు కబ్జాలను అడ్డుకుంటె రియల్ ఎస్టేట్ పడిపోతుందా అని ప్రశ్నించారు.

హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదని, బీఆర్ఎస్ నాయకుల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా వచ్చిన తరువాత కూడా హైదరాబాద్ లో నెల నెలా రిజిస్ట్రేషన్లు పెరిగిన మాట వాస్తవమని, స్క్వేర్ యార్డ్స్ నివేదిక కూడా ఇదే చెప్పిందని తెలిపారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ పాదయాత్ర కాదు , మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు నమ్మరన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఇస్తే తప్పేంటన్నారు. పనులు సరిగ్గా చేయకుంటే కంపెనీలపై చర్యలు ఉంటాయన్నారు. కార్పోరేట్ పెట్టుబడులను స్వాగతిస్తామని, వనరులు దోచుకుంటామంటే వ్యతిరేకిస్తామని సామ స్పష్టం చేశారు.

Advertisement

Next Story