- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేయించుకోవాలి : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
దిశ,శంషాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేయించుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదు కార్యక్రమం బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మి రామ్ హరన్ టవర్స్ లో ప్రారంభమైంది. స్వయాన జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలు నమోదు చేసి ఇంటికి స్టిక్కర్ అంటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించారని దీనిలో ప్రతి ఒక్కరు కుటుంబానికి సంబంధించిన వివరాలు అధికారులు అడిగినవన్నీ నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కుటుంబ సర్వే వల్లే సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతాయన్నారు. రాష్ట్రంలో కుల గణన సర్వే చేయడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఖ్య తెలుస్తుందని దీనివల్ల రాబోయే రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పెంచేందుకు వీలు పడుతుందన్నారు.