- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోహిని- రెహమాన్ ఎఫైర్ పై స్పందించిన తనయుడు.. చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్

దిశ, సినిమా: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల తర్వాత మరుసటి రోజే ఏఆర్ రెహమాన్ దగ్గర పని చేస్తున్న మోహిని కూడా విడాకులు ప్రకటించినది. దీంతో వీరిద్దరి విడాకులు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఇద్దరూ ఒకేసారి డైవర్స్ ప్రకటించడంతో.. వీరిద్దరి మధ్య ఏదైనా వివాహేతర సంబంధం నడుస్తుందేమో అని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారేమో అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
అయితే వీరి మధ్య రిలేషన్ గురించి కానీ, వారు ఒకేసారి విడాకులు ప్రకటించడం గురించి కానీ, అటు రెహమాన్ కానీ, ఇటు మోహిని కానీ క్లారిటీ ఇవ్వలేదు.ఈ క్రమంలో తాజాగా ఈ పుకార్లపై రెహమాన్ కొడుకు అమీన్ స్పందింస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. తన తండ్రి గురించి ఇలాంటి మాటలు వినడం చాలా బాధగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
‘ నా తండ్రి ఒక లెజెండ్. కేవలం అద్భుతమైన మ్యూజిక్‌ను అందించడంలోనే కాదు విలువలు, గౌరవం, ప్రేమ అన్నింటిని ఆయన సంపాదించుకున్నారు. అలాంటి ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయడం చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. అసలు ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు నిజాలేంటి అనేవి కూడా తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను స్ప్రెడ్ చేయకండి. ఆయనను, ఆయన వృత్తిని గౌరవిద్దాం’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.