Finance Ministry: పీపీఎఫ్ ఖాతాల నామినీ అప్‌డేట్ కోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు: ఆర్థిక మంత్రి

by S Gopi |
Finance Ministry: పీపీఎఫ్ ఖాతాల నామినీ అప్‌డేట్ కోసం ఎటువంటి ఛార్జీలు ఉండవు: ఆర్థిక మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: చిన్న మొత్తాల పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) అకౌంట్లకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. పీపీఎఫ్ అకౌంట్ల నామినీ అప్‌డేట్ లేదా మార్పునకు ఇకమీదట ఎలాంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో పోస్ట్ చేశార్. పీపీఎఫ్ అకౌంట్ల విషయంలో నామీనీ వివరాలను మార్చడానికి పలు ఆర్థిక సంస్థలు ఫీజులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చింది. అటువంటి ఛార్జీలను తొలగించడానికి జీఓ తీసుకొచ్చాం. ఇటీవల ప్రభుత్వ సేవింగ్స్ ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లో అవసరమైన మార్పులు చేశాం. పీపీఎఫ్ ఖాతాల కోసం నామినీల అప్‌డేషన్‌పై ఏవైనా ఛార్జీలను తొలగించడానికి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ సేవింగ్స్ ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లో అవసరమైన మార్పులు జరిగాయి. ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం, నాలుగు నామినీలను ఇచ్చేందుకు అనుమతి ఉందని ఆమె తెలిపారు. సాధారణంగా పొదుపు పథకాలకు నామినీగా ఎవరినైనా చేర్చడం తప్పనిసరి. ఖాతాదారు మరణించిన సమయంలో నామినీగా ఉన్న వ్యక్తికి నిధులు బదిలీ చేస్తారు. అయితే, ఈ వివరాల సేకరణ కోసం ఇప్పటివరకు రూ. 50 ఛార్జీ వసూలు చేశారు. దీన్ని రద్దు చేస్తూ, ఇకపై ఎటువంటి ఛార్జీలు అవసరంలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి వచ్చింది.



Next Story

Most Viewed