- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా.. మ్యాజిక్ ఫిగర్ దాటిన మహాయుతి
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాషాయ గాలి వీస్తోంది. 160 స్థానాల్లో మహాయుతి కూటమి ముందంజలో ఉండగా.. 107 స్థానాల్లో ఎంవీఏ కూటమి, 9 స్థానాల్లో స్వతంత్రులు ముందంజలో ఉన్నారు. కొప్రిలో సీఎం ఏక్ నాథ్ షిండే ముందంజలో ఉన్నారు. వర్లిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాహింలో రాజ్‌ఠాక్రే కుమారుడు అమిత్, కొలాబాలో స్పీకర్ రాహుల్ నర్వేకర్, బారామతిలో అజిత్ పవార్, సపోలిలో పీసీసీ చీఫ్ నానా పటోలె వెనుకంజలో ఉన్నారు. మరోవైపు వయనాడ్ ఉపఎన్నిక ఫలితాల్లో ప్రియాంక గాంధీ ఊహించని రీతిలో లీడింగ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె 46 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.
ఝార్ఖండ్ లో హేమంత్ సోరెన్
గండేలో హేమంత్‌సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. ధన్వార్‌లో ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు బాబులాల్ మరాండి, సరాయ్‌కెలాలో ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయీ సోరెన్, ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో భాజపా అభ్యర్థి, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్ లో ఉన్నారు.