Champai Soren: గెలిచేది బీజేపీయే.. జార్ఖండ్ ఫలితాలపై చంపై సోరెన్ కామెంట్స్

by Shamantha N |
Champai Soren: గెలిచేది బీజేపీయే.. జార్ఖండ్ ఫలితాలపై చంపై సోరెన్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో(Jharkhand) అధికార మార్పిడి ఖాయమని కాషాయ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, కమలం పార్టీ నేత చంపై సోరెన్‌ (Champai Soren) అన్నారు. జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనని( BJP-NDA) స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చెప్పుకొచ్చారు. మరికొన్ని గంటల్లో ఇది తేలనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎవరనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు. జార్ఖండ్ కి అతిపెద్ద సమస్యగా బంగ్లాదేశీల అక్రమ వలసలు(Bangladeshi infiltrators) మారాయన్నారు. అక్రమ వలసదారుల జనాభా చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నదని తెలిపారు. మరోవైపు, కొన్ని నెలల క్రితమే జార్ఖండ్ ముక్తి మోర్చాకు(JMM) రాజీనామా చేసిన చంపై సోరెన్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన సెరైకేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

రెండు విడతల్లో పోలింగ్

ఇకపోతే, జార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 13న మొదటి దశ, 20న రెండో, ఆఖరి విడత పోలింగ్‌ జరిగింది. కాగా.. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. అక్కడ బీజేపీ, జేఎంఎంల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. అధికార జేఎంఎం 9 స్థానాల్లో, బీజేపీ కూటమి 9 స్థానాల్లో ముందంజలో ఉంది. 81 సీట్లున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం.

Advertisement

Next Story

Most Viewed