- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan: మరోసారి వారిపై ప్రేమను బయటపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో.. నెట్టింట వైరలవుతోన్న స్పెషల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ నటుడు సక్సెస్‌కు కారణం తన తండ్రేనంటూ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఎప్పుడు తన ఫాదర్ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ తన తండ్రిపై ప్రేమ, జీవిత ప్రయాణాన్ని ‘యాంగ్రీ యంగ్ మెన్’(Angry Young Men)అనే డాక్యుమెంటరీ ద్వారా వెల్లడించారు.
ఇకపోతే లేటెస్ట్‌గా ఈ హీరో తన ఫాదర్ ను మరోసారి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఫస్ట్ టైమ్ కొనిచ్చిన బైక్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు సల్మాన్ తండ్రి బైక్ పై కూర్చుని ఉన్నాడు. సల్మాన్ తన ఫాదర్ పక్కన నిల్చనున్నాడు. నాన్న మొదటి బైక్.. ట్రయంఫ్ టైగర్(Triumph Tiger) 100.. 1956’ అని క్యాప్షన్ కూడా జోడించారు. క్షణాల్లో సల్మాన్ ఖాన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రయంఫ్ టైగర్ బైక్‌ను మీరు నటించిన మూవీస్ కోసం ఉపయోగించారు కదా? అంటున్నారు జనాలు.