Nagarjuna: యువసామ్రాట్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..!!

by Anjali |   ( Updated:2024-11-23 09:27:48.0  )
Nagarjuna: యువసామ్రాట్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna) గోవా(Goa)లో జరుగుతోన్న ఇఫీ కార్యక్రమాల్లో దివంగత నటుడు ఏఎన్నార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సెంటినరీ స్పెషల్ ఏఎన్నార్: సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు’(Centenary Special ANR: Celebrating the Life and Works of Akkineni Nageswara Rao') పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఏఎన్నార్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారని.. చాలా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నానమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని.. కాగా నాన్ననే చిన్నప్పుడు ఆడపిల్లలా అలంకరించి హ్యాపీగా ఫీల్ అయ్యేదంటూ తెలిపారు.

అదే ఏఎన్నార్ కు నటనలో మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి మేలు చేసిందని అన్నారు. అప్పటి రోజుల్లో సినిమాల్లో నటించడానికి అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు కాదని పేర్కొన్నారు. కాగా ఆయన అప్పట్లో స్త్రీ పాత్రల్లో నటించేవారని.. దీంతో ఎంతో మంది నాన్నను హేళన చేశారని వెల్లడించారు. ఆ ట్రోల్స్ వల్ల నాన్న కొన్ని సందర్భాల్లో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారని అన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టి.. తను ఏంటో అందరికీ నిరూపించాలని చాలా కష్టపడ్డారని.. సవాల్ విసిరే రోల్స్‌లో నటించి.. ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటుడిగ గుర్తింపు దక్కించుకున్నారని నాగార్జున వివరించారు.


Read More..

Nagarjuna: యువసామ్రాట్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Advertisement

Next Story

Most Viewed