స్పెషల్ పోస్టర్‌తో అక్కినేని నాగచైతన్యకు విషెస్ చెప్పిన మూవీ టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-11-23 15:01:05.0  )
స్పెషల్ పోస్టర్‌తో అక్కినేని నాగచైతన్యకు విషెస్ చెప్పిన మూవీ టీమ్.. ఆకట్టుకుంటున్న పోస్ట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తర్వాత ‘ఏమాయ చేశావే’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సమంతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా పెళ్లైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకొని వీడిపోయారు. ఇక డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అయితే చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఇక తండేల్ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ రోజు అక్కినేని హీరో నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో చిత్రబృందం చైతన్య స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఆ పోస్టర్‌కు ఇక రాజులమ్మ జాతరే అంటూ నాగ చైతన్య ఊరమాస్ డైలాగ్‌ని యాడ్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే టు అవర్ తండేల్ రాజు యువ సామ్రాట్ అనే క్యాప్షన్ జోడించారు. కాగా ఈ స్టిల్ ఓ ఫైటింగ్ సీన్‌లోది అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు నాగ చైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More...

Nagarjuna: యువసామ్రాట్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..!!







Advertisement

Next Story

Most Viewed