- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందు అక్కినేని ఇంట పంచాయతీ.. రిక్వెస్ట్ చేసినా వెనక్కి తగ్గని నాగ చైతన్య?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ(Shobhita Dulipala)తో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆగస్ట్ 8న వీరిద్దరు ఎంగేజ్మెంట్(Engagement) చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. త్వరలో వీరి వివాహం కూడా జరగబోతుంది. పెళ్లి(marriage) పనులు కూడా స్టార్ట్ అయినట్లు పసుపు దంచుతున్న ఫొటోలను శోభిత షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక నాగచైతన్య(Naga Chaitanya) సినిమాల విషయానికొస్తే.. ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని చందు మొండేటి(Chandoo Mondeti ) తెరకెక్కించగా.. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్గా నటిస్తుంది.
అయితే ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. అంతా బాగానే ఉందనుకునే క్రమంలో.. తాజాగా, అక్కినేని ఇంట పెద్ద పంచాయతీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున(Nagarjuna)కు, చైతన్యకు మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. నాగార్జున నటించిన ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్, రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ‘తండేల్’ విడుదల అవుతున్న ఫిబ్రవరి నెలలోనే థియేటర్స్‌లోకి రాబోతుందని సమాచారం.
ఇక ఈ విషయంలోనే నాగ్, చైతుని రిక్వెస్ట్ చేశారట. తండేల్ రిలీజ్ డేట్‌ను మార్చుకోమని అడిగినప్పటికీ చైతన్య మాత్రం నో చెప్పాడని తెలుస్తోంది. రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకపోవడంతో నాగార్జునకు కోపం రావడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ అయినట్లు టాక్. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు అవన్నీ పుకార్లు సినిమాల విషయంలో గొడవ పడటమేంటని అంటున్నారు.