ఫార్ములా-ఈ రేసు కేసు.. దూకుడు పెంచనున్న ఏసీబీ

by Mahesh |
ఫార్ములా-ఈ రేసు కేసు.. దూకుడు పెంచనున్న ఏసీబీ
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా-ఈ రేస్ (Formula-E Race) కేసు(case) విచారణను ఏసీబీ అధికారులు(ACB officials) ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా.. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తెప్పించుకుని పరిశీలించారు. ఈ కేసును ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ACB Central Investigation Team) విచారించనుంది. ముందుగా ఈ-రేసు పై ఫిర్యాదు చేసిన దానకిశోర్ వాంగ్మూలం(Testimony of Danakishore)ను ఏసీబీ(ACB) అధికారులు నమోదు చేయనున్నారు. అనంతరం.. నోటీసులు ఇచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించనున్నారు. కాగా ఈ వ్యవహారం లో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ(ED) దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే నగదు వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు(money launderingcase)ను ఈడీ నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed