- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫెమా కేసులో మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానికి ఈడీ సమన్లు
దిశ, నేషనల్ బ్యూరో: టీఎంసీ నేత మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు మార్చి 28న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE) ఖాతాకు లింక్ అయిన లావాదేవీలు, ఇతర విదేశీ చెల్లింపులు, నిధుల బదిలీల గురించి ఈడీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
లోక్‌పాల్ ఆదేశాల మేరకు కొన్ని నెలల క్రితం బహిష్కరణకు గురైన మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ కూడా ప్రాథమిక విచారణ జరుపుతోంది. డిసెంబర్‌లో అనైతిక ప్రవర్తన క్రింద తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రా లోక్‌సభ నుండి బహిష్కరించబడ్డారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు హీరానందానీ నుంచి ముడుపులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా మహువా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆమె రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ లోక్‌సభ నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు.