- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రంజిత్ సింగ్ హత్య కేసు.. డేరాబాబా నిర్దోషి అని తీర్పు ఇచ్చిన హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ కు రంజిత్ సింగ్ హత్యకేసులో ఊరట లభించింది. రంజిత్ సింగ్ హత్య కేసులో ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది పంజాబ్-హర్యానా హైకోర్టు. ఈ కేసులో డేరాబాబాతో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన బెంచ్ డేరా బాబా అప్పీల్ పై ఈ తీర్పు ఇచ్చింది. అత్యాచారం కేసు, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో డేరాబాబాను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ డేరాబాబా హైకోర్టుని ఆశ్రయించారు. వీటిల్లో రంజిత్ సింగ్ హత్యకేసులో ఆయన్ని నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు తీర్పిచ్చింది. జర్నిలిస్టు ఛత్రపతి హత్య కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తెలుపలేదు. ప్రస్తుతం డేరాబాబా రోహ్ తక్ లోని సునారియా జైళ్లో ఉంటున్నాడు.
డేరా బాబా అనుచరుడైన రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యారు. ఆయన ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను పేర్కొంటూ రాసిన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్ రాసినట్లు డేరా బాబా సందేహించారు. దీంతో రంజిత్ ను హత్య చేసినందుకు డేరాబాబా కుట్రపన్నినట్లు సీబీఐ పేర్కొంది. ఇద్దరు సాధ్వీలను రేప్ చేసినట్లు తేలడంతో డేరాబాబా 2017లో జైలుకు వెళ్లాడు. ఆ కేసులో సీబీఐ ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Read More..