- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dallewal : రైతుల జీవితాల కంటే నా ప్రాణం ముఖ్యం కాదు.. జగ్జిత్ సింగ్ దల్లేవాల్
దిశ, నేషనల్ బ్యూరో: తన ప్రాణం కంటే దేశంలోని రైతుల భవిష్యత్ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నానని రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ (Jagjith singh dallewal) అన్నారు. లక్షలాది మంది భారతీయ రైతుల జీవితాల కంటే నా ప్రాణం ముఖ్యం కాదని తెలిపారు. ఆమరణ దీక్ష చేపట్టి 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఖనౌరీ సరిహద్దులో శనివారం నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష భగ్నం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అంతే బలంగా ప్రతిస్పందిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎంఎస్పీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖనౌరీ సరిహద్దుకు రైతులు భారీగా చేరుకుని కిసాన్ మహా పంచాయత్‌లో పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాబిన్‌లో దల్లేవాల్ కూర్చుని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, ఖనౌరీ సరిహద్దులో గతేడాది నవంబర్ 26 నుంచి దల్లేవాల్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆయనకు వైద్య సాయం అందించాలని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.