ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Naveena |
ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ,కనగల్లు: నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని శ్రీ అక్కినపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ థామస్ అయ్యా తెలిపారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ..2025 -26 అకాడమిక్ సంవత్సరం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశానికి ఈనెల తేదీ 06/01/2025 నుంచి 28/02/2025 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. BC, SC,ST,PHC&EWS విద్యార్థులు రూ.125 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర OC విద్యార్థులు రూ.200 చెల్లించాలన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 3 తేదీ నుండి డౌన్లోడ్ https://telanganams.cgg.gov.in లో చేసుకోవాలన్నారు. ఆరవ తరగతిలో 100 సీట్లు, ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠశాలలో మిగిలి ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేయగలమని తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు 13/04/2025 తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు..అదేరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story