కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

by Sridhar Babu |
కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు
X

దిశ, సుల్తానాబాద్ : పట్టణ కేంద్రంలోని చెరువు కట్ట సమీపాన కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం చెరువు కట్ట సమీపాన నివాసం ఉంటున్న వివరం నేని భూమారావు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సుల్తానాబాద్ వైపు యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుండి పెద్దపల్లి వైపు వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనం పై నుండి భూమారావు ఎగిరి కింద పడగా తల పగిలి తీవ్రగాయాలు అయ్యాయి. ఢీకొన్న కారు ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు గమనించి హుటాహుటిన వృద్ధుడి బంధువులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వారి బంధువులు తీవ్ర గాయాలైన భూమారావును కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story