ఇందిరమ్మ సర్వే విషయంలో ఎలాంటి పొరపాటు జరగనివద్దు : మహబూబాబాద్ కలెక్టర్

by Aamani |
ఇందిరమ్మ సర్వే విషయంలో ఎలాంటి పొరపాటు జరగనివద్దు : మహబూబాబాద్ కలెక్టర్
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ కురవి మండలం లో విస్తృతంగా పర్యటించారు. అయ్యగారి పల్లి గ్రామం, కురవి మండల కేంద్రంలోని జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వే ను ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందని ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటా ఎంట్రీ చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంట కురవి తాహసీల్దార్ సునీల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story