- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..?
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇవాళ్టి(జనవరి 06) నుంచి ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటి నుంచి EHS, OP సేవలను మాత్రమే బంద్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్(AP Network Hospitals Association) అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్(K.Vijayakumar) ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే రూ.3 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి అని తెలిపారు. వైసీపీ(YSRCP) హయాంలో రూ.2,250 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1500 కోట్ల విడుదల చేసినప్పటికీ ఇంకా.. రూ.3 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందజేయలేమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. తమ నోటీసులపై స్పందించిన.. ట్రస్ట్ సీఈఓ(CEO) ఫోన్ చేసి బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారని.. ఈ క్రమంలో రేపు చర్చకు ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం(AP Government)తో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రేపు(మంగళవారం) స్పెషల్ సీఎస్‌తో అసోసియేషన్ భేటీ కానుంది.