శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యం : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి

by Aamani |
శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యం : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
X

దిశ,మెదక్ టౌన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదుదారుల నుండి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ఎస్ఐ, సీఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితి, పరిష్కారానికి సూచనలు చేశారు.

ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునెల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేల, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story