పెండింగ్ దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి

by Sridhar Babu |
పెండింగ్ దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి
X

దిశ, కరీంనగర్ టౌన్ : కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి అనంతరం వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు, ధరణి, భూ సేకరణకు సంబంధించిన దరఖాస్తుల కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హాస్టళ్లను తనిఖీ చేసి సౌకర్యాలు పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలకు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. త్వరలో మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని.. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజావాణిలో సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. తమ పరిధిలోని భూ సేకరణకు సంబంధించిన కేసులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఇటీవల జరిగిన దిశా కమిటీ సమావేశానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story