- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Game Changer: నా కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అవుతుంది.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). ఇందులో కియారా అద్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి (Anjali) ముఖ్య పాత్రలో కనిపించనుంది. తెలుగు (Telugu), తమిళ (Tamil), హిందీ (Hindi) భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు.
‘గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి (Parvati). మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ కథ చెప్పినప్పుడు.. కారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ (Pre release) ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ (demand) చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ నా పర్ఫామెన్స్ (Performance)ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. అంతేకాదు ఇందులో నా పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు. నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాకు కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి’ అంటూ చెప్పుకొచ్చింది.