- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుంభకోణాలు, ఉగ్రవాదానికి కాంగ్రెస్ పర్యాయ పదం: యూపీ సీఎం యోగి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కుంభకోణాలు, ఉగ్రవాదం, మావోయిజం వంటి వాటికి కాంగ్రెస్ పర్యాయపదమని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. యువత చేతిలో ట్యాబ్, ఓ మంచి పుస్తకం ఉండాలని తెలిపారు. కానీ కాంగ్రెస్ వారి చేతుల్లో తుపాకులు పెట్టి నక్సలిజం, ఉగ్రవాదం పేరుతో దేశానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని ప్రేరేపించిందని చెప్పారు. మోడీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశం ఎంత మార్పు చెందిందో ప్రజలు చూశారని తెలిపారు.
దేశాన్ని ప్రపంచంలోనే పెద్ద శక్తిగా మార్చేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ప్రజలకు ఉచిత రేషన్ అందించామని తెలిపారు. అలాగే రామమందిరాన్ని నిర్మించి కోట్లాది మంది కలను నెరవేర్చామని చెప్పారు. నక్సలిజాన్ని రూపుమాపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. సమస్యను సృష్టించడానికి కాంగ్రెస్ పర్యాయ పదం అయితే, సమస్యను పరిష్కరించడానికి పర్యాయ పదం బీజేపీ అని నొక్కి చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.