Reel Minister : కేంద్ర రైల్వే మంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

by Bhoopathi Nagaiah |
Reel Minister : కేంద్ర రైల్వే మంత్రిపై కాంగ్రెస్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా నడుస్తున్నాయి. ఈ రోజు రైల్వే ప్రమాదాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు, ఇటు అధికారపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇటీవల వరుసగా రైళ్లు పట్టాలు తప్పుతుండటం, ప్రమాదాలపై గురువారం లోక్‌సభ‌ దద్దరిల్లింది. కాంగ్రెస్ ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను 'రీల్ మినిస్టర్' అంటూ ఎగతాళి చేశారు. ఇక వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు రైల్వేమంత్రి. ‘మేం కేవలం రీళ్లు చేసేవాళ్లం కాదు.. కష్టపడి పనిచేసేవాళ్లం’ అని మంత్రి అన్నారు.

తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్‌ పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడూతూ.... గత రెండు నెలల్లో నాలుగు గూడ్స్‌ రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మరణించినా రైల్వే శాఖ మంత్రి ఎలాంటి నైతిక బాధ్యత వహించలేదని, నైతిక బాధ్యత వహించకపోగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారని విమర్శలు చేశారు. ఆయన రైల్వే మంత్రి కాదని రీల్‌ మినిస్టర్‌, డిరైల్‌మెంట్‌ మినిస్టర్‌ అని ఎద్దేవా చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రైలు ప్రమాదాలపై మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమాధానం సంతృప్తికరంగా లేదని, అందుకే ఇండియా కూటమి పార్టీలు సభ నుంచి వాకౌట్‌ చేశాయని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గగోయ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed