- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > అమిత్ షాపై కాంగ్రెస్ ఫైర్.. ఆ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న జైరాం రమేష్
అమిత్ షాపై కాంగ్రెస్ ఫైర్.. ఆ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న జైరాం రమేష్
X
దిశ,డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కుటుంబ రాజకీయాలు పరాకాష్టకు చేరుతాయని, రాష్ట్రంలో అల్లర్లు ఎక్కువవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. అమిత్ షా వ్యాఖ్యలు నిస్సందేహంగా భయపెట్టే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ధ్వజమెత్తారు. అమిత్ షా మాటలతో కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందనే విషయం స్పష్టం అవుతోందన్నారు.
ఓటమి భయంతోనే ఎన్నికల ప్రచారంలో అల్లర్ల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని.. అమిత్ షా వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అమిత్ షా (4-ఐ) ఇన్ సల్ట్, ఇన్ ఫ్లేమ్, ఇన్ సైట్, ఇంటిమిడేట్ అనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని ఇది సిగ్గుచేటు అని ఘాటుగా విమర్శించారు.
Advertisement
Next Story