ఎస్సీ రిజర్వేషన్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
ఎస్సీ రిజర్వేషన్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ రిజర్వేషన్ల అమలులో సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్ విధానాన్ని పాటించాలని చెప్పిన సుప్రీం తీర్పును పక్కన పెట్టాలని కేంద్రానికి సూచించారు. క్రిమిలేయర్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు నిరాకరించే ఆలోచనను ఖండించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో క్రిమిలేయర్ గురించి ప్రస్తావించిన భాగాలను తొలగిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ, దానికి మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ వల్ల వచ్చే సమస్యల గురించి సుప్రీం న్యాయమూర్తులు ఆలోచించినట్టు లేరని ఖర్గే అభిప్రాయపడ్డారు.

Next Story

Most Viewed