- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియా వాడకంపై వయసు పరిమితి.. కనీసం 21 ఏళ్లు!
న్యూఢిల్లీ: దేశంలో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితిని విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం పేర్కొంది. సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని సూచించింది. నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) చేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఈ సోషల్ మీడియా సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విచారణ ముగింపు సందర్భంగా.. సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తేనే మేలు జరుగుతుందని పేర్కొంది.
స్కూల్‌కు వెళ్లే పిల్లలు దీనికి అడిక్ట్ అవుతున్నారని.. ఎక్సైజ్ నిబంధనల మాదిరి ఇక్కడ కూడా వయోపరిమితి ఉండాలని తాము భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. కొన్ని ఆన్‌లైన్ గేమ్స్ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు యూజర్ ఆధార్, ఇతర పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే.. అటువంటి గుర్తింపును సోషల్ మీడియాకు కూడా ఎందుకు విస్తరించడం లేదని కోర్టు ప్రశ్నించింది.