- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP president: 2025లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు..!
దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే జనవరిలో భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి (BJP chief) నియామకం జరగనుంది. ఇప్పటికే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో, ఫిబ్రవరి చివరినాటికి బీజేపీ చీఫ్ ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని (BJP national president) ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు(organisational elections) పూర్తి అవ్వాలి. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సగానికి పైగా రాష్ట్ర యూనిట్లలో పోలింగ్ ప్రక్రియ జనవరి మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరికి జేపీ నడ్డా(JP Nadda) స్థానంలో కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆరోగ్యమంత్రిగా నడ్డా
కాగా, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా (JP Nadda) ఉన్నారు. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే. దీంతో, ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. మరోవైపు, ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక, బీజేపీ కొత్త చీఫ్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వారిలోనే ఒకరికి జాతీయాధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారా..? లేక కొత్త వారిని తీసుకుంటారా..? అనే విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.